Home / Covid
కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది బుధ వారం నుంచి వినాయనకుని ఉత్సవాలు, పూజలు ప్రారంభమయ్యాయి.ఇదే క్రమంలో కరోనా కేసులు కూడా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిసిన సమాచారం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 7, 231 కేసులు వచ్చాయి.
తెలంగాణఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి, కల్వకుంట్ల తారక రామారావు కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో కొవిడ్ -19 పరీక్ష నిర్వహించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన వెల్లడించారు.
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.