Home / Congress President Polls
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం; థరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించి, రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీయేతర అధ్యక్షుడిగా అవతరించేందుకు మార్గం సుగమం చేశారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.
22 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎఐసిసి అధ్యక్షుడిని నిర్ణయించేందుకు ఆ పార్టీ ప్రతినిధులు సిద్ధమయ్యారు.
22 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటి (ఏఐసిసి) ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ప్రతినిధులు 9308మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపటిదినం ఆయా రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో డెలిగేట్స్ ఓటు వేయనున్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్‌లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. రాజస్థాన్‌లో తన విశ్వాసపాత్రులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ గందరగోళానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాపణలు కూడా చెప్పారు.
గాంధీ కుటుంబం నుండి ఎవరూ తదుపరి పార్టీ అధ్యక్షుడు కాకూడదని పార్టీ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్ఫష్టం
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది. సుదీర్ఘకాలం పాటు పార్టీ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ వారసుడిని ఎన్నుకునేందుకు వేదికను సిద్ధం చేసింది.