Home / Congress Party
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్‌తో కలిసి వెంట నడిచారు.
: కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని మాజీ కాంగ్రెస్ నాయకురాలు రాధికా ఖేరా అన్నారు. కాగా ఆమె ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనపై చత్తీస్‌గఢ్ యూనిట్ మీడియా చైర్మన్ సుశీల్ ఆనంద్ శుక్లా తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు.
తెలంగాణాలో బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ లో చేరారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అమిత్‌రెడ్డి కలిశారు.
ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి ఏ కె ఆంటోని ఉన్నారని ఆయన కుమారుడు, పతనంతిట్ట నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అనిల్ కె ఆంటోని వ్యాఖ్యానించారు.వ్యక్తిగతంగా తన తండ్రి ఎకె ఆంటోని అంటే తనకు అత్యంత గౌరమని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు తిరస్కరించారని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన కామెంట్ చేసారు. .
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు.
తెలంగాణలో నువ్వా - నేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దానికి దిగుతూ తగ్గేదేలే అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తూ అగ్ర నేతలను రంగంలోకి దించుతుంది. అందులో భాగంగానే సీఎల్పీ
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? అని కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో జోష్ ఇచ్చే పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రీసెంట్ గానే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కూడా చేరారు. ఇప్పుడు తాజాగా మరో నటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
తెలంగాణలో ఎన్నికల సమరంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు.. అధికారం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరుస మీటింగ్ లతో ప్రజలతో మమేకం అవుతున్నారు. అందులో భాగంగా మంగళవారం మధిర నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభం