Home / collapsed
ఉత్తరాఖండ్‌లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా శివాలయం కూలిపోవడంతో కనీసం తొమ్మిది మంది మరణించారని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సిఖు తెలిపారు.కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురు చిక్కుకున్నారని, పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.