Home / cm jagan
కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా గతంలో పాలకులు చేయనివిధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ -200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం జగన్ ప్రారంభించారు.
: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు.. ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం, బాలిరెడ్డి పల్లి లో వరద బాధితులతో జగన్ మాట్లాడారు.ప్రభుత్వం అందించే రేషన్ వివరాలు వెల్లడిస్తూ కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని జగన్ వ్యాఖ్యానించారు.
తెలంగాణాలో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామజోగయ్య స్పందించారు. వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌కు పట్టే గతే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌కు పట్టబోతుందని జోగయ్య జోస్యం చెప్పారు.
ఏపీలో క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు వద్ద పచ్చ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. జాతీయ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి) సహకారంతో స్వచ్ఛత ఉద్యమి యోజన (ఎస్‌యువై) కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎంపిక చేసిన 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు (సఫాయి కర్మచారిలు) ముఖ్యమంత్రి లాంఛనంగా వాహనాలను అందజేశారు.
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
చంద్రబాబుకు పదవి కావాల్సింది ప్రజలకు మంచి చేయడానికి కాదని.. రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకే వారికి అధికారం కావాలని సీఎం జగన్ అన్నారు. పుట్టపర్తిలో రైతు భరోసా, పీఎం కిసాని నిధులు విడుదల చేసిన జగన్ టీడీపీపై విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. అంగళ్లులో పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని.. ఓ కానిస్టేబుల్‌కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు.
వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో ఈ పథకం లబ్దిదారులకు సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు
డిసెంబర్ లోగా విశాఖకు మారతామని ఇక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం వివాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని, పరిపాలనా విభాగం మొత్తం విశాఖకు మారుతుందని చెప్పారు.