Last Updated:

Kesineni Nani: సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని

ఏపీ సీఎం జగన్‌ను కేశినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంపు ఆఫీసుకు కేశినేని శ్వేత వెళ్లారు. నాని వెంట మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ అయోధ్యరాంరెడ్డి, దేవినేని అవినాష్‌లు ఉన్నారు.

Kesineni Nani: సీఎం జగన్ ను  కలిసిన కేశినేని నాని

 Kesineni Nani: ఏపీ సీఎం జగన్‌ను కేశినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీస్‌లో జగన్‌తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంపు ఆఫీసుకు కేశినేని శ్వేత వెళ్లారు. నాని వెంట మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ అయోధ్యరాంరెడ్డి, దేవినేని అవినాష్‌లు ఉన్నారు.

వైసీపీలో చేరుతాను..( Kesineni Nani)

అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా లేఖను ముందుగా లోక్‌సభ స్పీకర్‌కు, ఆ తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పంపుతానని చెప్పారు.నేను ఈ రోజు వైఎస్‌ జగన్‌ను కలిశాను. ఆయన నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను అని నాని తెలిపారు. తన రాజీనామా ఆమోదం పొందాక వైసీపీలో చేరుతానన్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడని కేశినేని నాని ఆరోపించారు. ఏపీకి ఉపయోగం లేని వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు అవమానించిన తీరు వల్లే తాను టీడీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి 40 సీట్లకు మించి రావని విజయవాడ ఎంపీ అన్నారు.

చంద్రబాబు మోసగాడు..

యువగళం పాద యాత్ర ఏ హోదాలో నారా లోకేష్ నిర్వహించారని నాని ప్రశ్నించారు. నేను రెండుసార్లు ఎంపీగా ఉండగా ఆయన మంగళగిరి ఎన్నికల్లో ఓడిపోయారు. పార్టీ యంత్రాంగం మద్దతు ఉన్నప్పటికీ అతను ఎన్నికలలో ఓడిపోయాడు. తిరువూరులో నన్ను రౌడీలతో కొట్టించాలని లోకేష్ అనుకున్నారు.నేను టీడీపీ కోసం రెండు వేల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు పోగొట్టుకున్నానని నాని అన్నారు. చంద్రబాబు నాయుడును మోసగాడిగా అభివర్ణించిన నాని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సామాజిక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు తనకు నచ్చిందని అన్నారు. కమ్మ ప్రాబల్యం ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతానికి పైగా టీడీపీ క్యాడర్ పార్టీని వీడుతుందని అన్నారు.జగన్ పేదల పక్ష పాతి అని జగన్ తనకు బాగా నచ్చారని అన్నారు.