Last Updated:

CM Jagan: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

CM Jagan: ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ప్రారంభించిన సీఎం జగన్

CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

47 రోజులపాటు..(CM Jagan)

క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో నిర్వహించే ఈ పోటీలను గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్ లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలో నిలిచిపోవాలని.. 47 రోజుల పాటు ఆండుదాం ఆంధ్రా కార్యక్రమం ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని.. గ్రామాల్లో ఆణిమత్యాలను దేశానికి అందిస్తామని సీఎం జగన్ అన్నారు. ఈ సందర్బంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న సీఎం జగన్ వారికి స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసారు.

తెలుగు యువత నిరసన..

మరోవైపు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి నిరసన సెగ తగిలింది. గుంటూరు టౌన్ చుట్టు గుంట సెంటర్లో జిల్లా‌ తెలుగు యువత నిరసనకు దిగింది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక యువత నిస్పృహ లో ఉంటే ప్రభుత్వం ఆటల పేరుతో మభ్యపెట్టేలా చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆటస్థలాలు, క్రీడా ప్రాగణాలు ఖబ్జా చేసి ప్రైవేటు ఆటస్థలాల్లో ఆటల‌ నిర్వహణా అంటూ తెలుగు యువత ఆందోళనకు దిగింది. ఈ సందర్బంగా సీయం కార్యక్రమానికి వెళ్ళి తెలుగు యువత కార్యకర్తలు నిరసన తెలపడానికి ప్రయత్నించారు. గోబ్యాక్ సీయం అంటూ నినాదాలు చేసారు. ఈ సందర్బంగా టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడనుంచి తరలించారు.