Home / CM Hemant Soren
ఢిల్లీలోని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో జరిగిన సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు బీఎండబ్ల్యూలు, కొన్ని నేరారోపణ పత్రాలు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. సోరెన్ ఇంట్లో లేనందున ఈడీ బృందం అతన్ని ప్రశ్నించలేకపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని అన్నారు
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు, జేఎంఎం ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ఇటీవల ఢిల్లీ పర్యటన పై విలేకరులు ప్రశ్నించగా వారికి ఊహించని సమాధానం ఎదురయింది. నాకు లోదుస్తులు అయిపోయాయి. కాబట్టి నేను వాటిని కొనుగోలు చేయడానికి ఢిల్లీకి వెళ్లాను.
జార్ఖండ్ అంసెబ్లీలో సిఎం హేమంత్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. అసెంబ్లీలో ఆయన తన మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటు వేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బిజెపి సభ నుంచి వాకౌట్ చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విశ్వాస పరీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
జార్ఖండ్‌లో అధికార జెఎంఎం పార్టీ, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌కు మకాం మార్చింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎన్నికల సంఘం ఆగస్టు 26న అనర్హత వేటు వేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు జార్ఖండ్ సీఎం అధ్యక్షతన రాంచీలోని తన నివాసంలో అధికార జార్ఖండ్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దీనిపై తనకు ఎన్నికల సంఘం పంపిన నివేదికను త్వరలో ప్రకటించనున్నారు. గురువారం ఉదయం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్‌లో జార్ఖండ్ రాజ్ భవన్‌కు పంపగా, బైస్ కాసేపట్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తారు.
జార్ఖండ్ అక్రమ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో దాడులు చేసింది. రాంచీ, బీహార్, తమిళనాడు మరియు జాతీయ రాజధాని ప్రాంతంలోని అశోక్ నగర్ మరియు హర్ము ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.