Home / Chandrayaan-3 mission
చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్ను మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు ఇస్రోను ఆయన అభినందించారు.
ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని నేడు ముద్దాడనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుదిఘట్టం ఇవాళ ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగు పెట్టనుంది. నేడు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.