Home / Bus Yatra
ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే అక్టోబర్ 26 నుంచి బస్సుయాత్ర చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం కాంగ్రెస్ బస్సు యాత్ర రేపటినుంచి ప్రారంభం కానుంది. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రని లాంఛనంగా ప్రారంభిస్తారు.రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముందు పెట్టి పూజలు చేస్తారు
ఈ నెల 21నుంచి తెలంగాణ బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేయనున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బస్సు యాత్రపై సమీక్ష నిర్వహించారు.
దసరా నుంచి ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ - బస్సు యాత్ర పండుగ సందర్భంగా మొదలుకానుంది. ఆర్నెళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌ను చుట్టివచ్చేలా జనసేన భారీ ప్లాన్ చేసింది. యాత్రకు అపూర్వ ఆదరణ లభించాలంటే ఏం చేయాలన్నదానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయదశమి నుంచి బస్సు యాత్రకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా బస్సు తయారు చేస్తున్నారు. హైదరాబాద్‌లో తయారవుతున్న ఈ బస్సుకు రెగ్యులర్ బస్‌లు, లారీలకు వాడే పెద్ద టైర్లు ఉపయోగించారు.