Home / Bullet Train
భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు మొదటి సర్వీసును 2026లో నడిపే అవకాశం ఉందని కేంద్ర రైల్వే మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఒక వార్తాసంస్దకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్టాడుతూ అహ్మదాబాద్-ముంబై మార్గంలో బుల్లెట్ రైళ్ల పనులు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పారు.
జపాన్ అధికారిక పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదివారం నాడు రాజధాని నగరం టోక్యోకు బుల్లెట్ రైలులో బయలు దేరారు. 500 కిమీ ప్రయాణం కేవలం రెండున్నర గంటలు మాత్రమే పడుతుందని ట్వీట్ చేసారు.
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం దాదాపు 20,000 మడ చెట్లను నరికివేయడానికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.