Home / Breaking News
మొన్న వాట్సాప్ సేవలు నిన్న ఇన్ స్టాలో ఏర్పడిన అసౌకర్యం కారణంగా కొంత సమయం వరకు సేవలు నిలిచిపోయిన విషయం విధితమే. అయితే తాజాగా ఈ జాబితాలోకి ట్విట్టర్ కూడా వచ్చింది. నేడు అనగా శుక్రవారం ట్విట్టర్ సేవల్లో అంతరారయం ఏర్పడింది.
అతివేగంతో వస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్‌లో బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.
తెదేపా నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆయన మరణించారు.
భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చెయ్యగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకుని తేలలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాజాగా మరోమారు కొత్త రుణాన్ని సేకరించింది. తాజాగా మంగళవారం నాడు రూ.1,413 కోట్ల అప్పును తీసుకుంది.
స్టీల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ హాస్పిటల్‌లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బీ ప్రాంతంలోని సస్పెన్షన్ బ్రిడ్జి కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జ్ పై ఉన్న దాదాపు 400 మంది సందర్శకులు నదిలో పడిపోయినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విషయంలో కీలక నిర్ణయం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాష్ట్రంలో ఇకపై ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది.