Home / Breaking News
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి కారు ప్రయాణం చేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన వెళ్తున్న కారు పాల్ఘడ్ జిల్లాలో సూర్యనదిపై ఉన్న డివైడర్ ఢీకొని సైరస్ మిస్త్రీ గారు అక్కడే మృతి చెందారు.
జార్ఖండ్‌లో అధికార జెఎంఎం పార్టీ, దాని మిత్ర పక్షం కాంగ్రెస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌కు మకాం మార్చింది.
ప్రముఖ ఆర్ధిక వేత్త అభిజిత్ సేన్(72) గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినటట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ వెల్లడించారు. ఆగస్టు 29 న రాత్రి 11 గంటల సమయంలో అతనుకు గుండెపోటు బాగా రావడంతో హాస్పిటల్ కు తరలించారు.
సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.
నోయిడా లోని ట్విన్ టవర్స్ అందరూ ఊహించినట్టే భవనాన్ని కూల్చి వేశారు . 9 సెకన్లలోనే వ్యవధి లోనే పూర్తిగా కుప్ప కూల్చారు . దీనికోసం రెండు రోజుల నుంచి పనులను చేస్తూనే ఉన్నారు . ఆదివారం అనుకున్న సమయానికే భవనాలను కూల్చివేశారు.
బిజెపి నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి స్వర్గస్తులయ్యారు . మల్లయ్యకు ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉండగా ఈటల రాజేందర్ రెండో కుమారుడు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన నుపుర్ శర్మను అందరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని తాను ఆమెకు మద్దతు ఇస్తున్నానని పేర్కొన్నారు.