Home / Breaking News
టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నివాళులర్పిస్తూ నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. రేపు ఏపీ అంతటా ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణానికి గల కారణాలను వైద్యులు తాజాగా వెల్లడించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా అతడు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. దానితో షూటింగ్ నిలిపివేసి నాగశౌర్యని హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు చిత్ర బృందం.
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీలో విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
రోడ్డు మీద ఒకదాని ఒకటి వాహనాలు ఢీ కొంటుంటాయి. మరి ఆకాశంలో నిత్యం అటూ ఇటూ చక్కర్లు కొట్టే విమానాలకు అలాంటి ప్రమాదాలు సంభవించవా అనే డౌట్ మీకు ఎప్పుడైనా కలిగిందా. అలాంటి క్రేజీ డౌట్స్ ఉన్న వారి సందేహాలను నిజం చేస్తూ తాజాగా గాల్లో తిరుగాడే రెండు విమానాలు ఢీ కొన్నాయి. ఈ దృశ్యం చూసిన అక్కడి స్థానికులు ఔరా అంటూ నోరెళ్లబెట్టారు. ఈ దుర్ఘటనలో 6 మంది మృతి చెందారు.
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర శివారులో విషాదం చోటు చేసుకుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మల్కారం గ్రామ పరిధిలోని ఎర్రకుంట చెరువులో పడి 6మంది చనిపోయారు.
పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. "వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం" అని పవన్ హెచ్చరించారు.