Home / Breaking News
రాబిన్ ఊతప్ప క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తొలి టీ20 ప్రపంచకప్ హీరోగా రికార్డుకెక్కిన ఊతప్ప.. టీ20 ప్రపంచకప్‌లో తొలి బౌలౌట్‌లో భారత్‌ను గెలిపించాడు. కాగా ఈ బౌలర్ బుధవారం క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నాలు చేపట్టింది. దానికి గానూ ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె పెళ్లి భాజలు మోగిన ఆ ఇంట్లో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది.
జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో జరిగిన అగ్రిప్రమాదం మరువకముందే హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ఓ పబ్‌లో అగ్నికిలలు ఎగసిపడ్డాయి.
పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయి ఉన్నాయి. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులే కాక అటు రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపం తెలియజేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకన్న నేపథ్యంలో తాజాగా బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులను కూడా సీఎం జగన్‌మోహన్ రెడ్డి మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ లను నియమించారు.
కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే రెబల్ స్టార్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.