Home / Breaking News
తనలోని ఆడతనాన్ని మరచింది. స్వార్థ ప్రయోజనాల కోసం సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఓ ఘటన సోషల్ మీడియా వేదికగా బయటపడింది. పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్సిటీలోని దాదాపు 60మంది అమ్మాయిల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది ఓ యువతి.
విశాఖ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు విడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి వేరవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్టూడెంట్ పై లెక్చరర్ దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఫైర్ అయ్యింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్‌ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్‌ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
జార్ఖండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు నీటిలో చిక్కుకున్నారు.
అసలే తెలంగాణ రాష్ట్రంలో తెరాస వర్సెస్ భాజపా అన్నట్టుగా రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనలో పోలీసుల భద్రతా లోపం చోటుచేసుకుంది. అమిత్ షా కాన్వాయ్ ని తెరాస నేత కారు అడ్డగించింది.
మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం, ఆపై వారి దగ్గరి నుంచి నగదు, నగలతో పరారు కావడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సీన్ కట్ చేస్తే మంత్రి మా బంధువని కొంతమందిని, పోలీసు శాఖలో పలుకుబడి ఉందని మరికొందరి దగ్గర నమ్మపలికింది. 5 మందిని పెళ్లాడి చివరకు కటకటాలపాలయ్యింది.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఇష్టపడని క్రికెట్ అభిమానులుండరు. ఆ మ్యాచ్ ఆద్యంతం ఎప్పడు ఏం జరుగుతుందా.. ఎవరెలా ఆడతారా అనే ఆసక్తితో చూస్తుంటారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 23వ తేదీన ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు టికెట్స్ ఫుల్ అయ్యాయి.