Home / bollywood
లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత, విజయ్ దేవరకొండ పెద్దగా స్పందించలేదు. అయితే దర్శకుడు పూరీతో ప్రకటించిన జనగణమనను పక్కన పెట్టాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు.
నటి అమలా పాల్ అజయ్ దేవగన్ నేతృత్వంలోని భోలాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
కీర్తింపబడడం ఓ అదృష్టం. ఆ ఆనందాన్ని నిలుపుకోవడం మరింత అదృష్టం. దాన్ని పాటించారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ధరించిన పాదరక్షలు వదిలి మరీ నమస్కరించడం అతని సంస్కారానికి కొలబద్దగా నిలిచింది.
పఠాన్ టీజర్లో యాక్షన్ సీన్లు, ఫైట్స్ హైలెట్గా కనిపించాయి. రక్తంతో తడిసిన దుస్తులు.. విమానాలు, హెలికాప్టర్లతో తెరకెక్కించిన సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను తలదన్నెలా ఉన్నాయి . ఇక బైక్ ఛేజింగ్ సీన్లు..ఐతే చెప్పే పనే లేదు.పర్వత ప్రాంతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు టెక్నికల్ పరంగా చాలా బాగున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ భద్రతను కల్పించారు.
1973 నవంబరు 1 కర్ణాటకలోని మంగళూరులో ఐశ్వర్యారాయ్ జన్మించారు. 1994వ సంవత్సరంలో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు) తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. జీన్స్ (1998) సినిమాతో తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీలలో మొదటి హిట్ అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐష్. 20 ఏప్రిల్ 2007న బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ కుమారు అయిన అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్. ఎన్నోచిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు ఈ అందాల తార. 1980 దశకంలో హిందీపరిశ్రమలో అరంగేట్రం చేసిన ఈ తార చాలా కాలం పాటు అగ్రగామి నటిగా వెలుగొందారు. హం ఆప్కే హై కౌన్ దేవదాస్ రాజా వంటి పలు అద్భుత చిత్రాలెన్నెన్నో నటించి సినీపరిశ్రమలో పలు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులను కైవసం చేసుకున్నారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి సెట్స్ పై తన ఎడమకాలికి గాయమయిందని తన బ్లాగ్ పోస్ట్ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్పై విచారణ జరుగుతుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసింది. దివంగత నటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల తనయ జాన్వీకపూర్. మొదటి సినిమాతోనే తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయితే తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.