Home / bejawada kanaka durgamma
దసరా పండుగను పురస్కరించుకొని.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక
జనవరి 5వ తేదీ గురువారం ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఇంద్రకీలాద్రి దుర్గ గుడి ఈవోకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దుర్గగుడి ఈఓ గా భ్రమరాంబ వచ్చిన తర్వాత ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్ రంగురంగుల గాజులతో సర్వాం సుందరంగా అలంకరణలు చేశారు. వేలసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి గాజుల దండలను పేర్చుతున్నారు. వివిధ రకాల గాజులతో అమ్మవారు కన్నులవిందుగా భక్తులకు దర్శనం ఇస్తుంది.
దసరా వేడుకలు సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే వృద్ధులు,దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసి అదేశాలు జారీ చేసింది.వారికి వారికి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని,అలాగే ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.