Home / Balasore train accident
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని రైల్వే సేఫ్టీ కమిషనర్ ( సీఆర్ఎస్ ) నివేదిక తేల్చి చెప్పిందని తెలుస్తోంది. దీనితో ఈ ప్రమాదం వెనుకు ఎటువంటి కుట్ర లేదని స్పష్టమయింది.
బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బాలాసోర్‌లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు వేసింది. బాలాసోర్‌లోని అద్దె ఇంట్లో నివసించిన ఇంజనీర్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే అతను ఇప్పుడు తన కుటుంబంతో అదృశ్యమయ్యాడు.
డిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి కారకులైన వారిని విడిచిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అదివారం ఆయన ప్రమాదస్దలాన్ని సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఒడిసా రైలు ప్రమాదంపై యావత్ దేశప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి మూడు రైళ్లు ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు సైతం ఈ దుర్ఘటనపై స్పందిస్తున్నారు. పలువురు ఈ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.