Home / Asian Games
హాంగ్జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల త్రోతో తన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా తన వ్యక్తిగత అత్యుత్తమ 87.54 మీటర్లతో రజత పతకాన్ని సాధించారు.
: 41 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో భారత్ ఈక్వెస్ట్రియన్‌లో బంగారు పతకం సాధించింది.సుదీప్తి హజెలా (చిన్స్కీ - గుర్రం పేరు), హృదయ్ విపుల్ ఛేడా (కెమ్‌క్స్‌ప్రో ఎమరాల్డ్), అనుష్ అగర్వాలా (ఎట్రో), మరియు దివ్యకృతి సింగ్ (అడ్రినాలిన్ ఫిర్‌ఫోడ్)లతో కూడిన భారత బృందం ఈక్వెస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. ఈ రోజు ఉదయం షూటింగ్ విభాగంలో భారత్ కు మొదటి బంగారు పతకం వచ్చింది. దీనితో ఆసియాక్రీడల్లో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 9 కు చేరింది.
ఆసియా క్రీడల్లో భారతదేశపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది.భారత షూటర్లు దివ్యాన్ష్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ మరియు రుద్రంక్ష్ పాటిల్ ఆభారత్కు తొలి బంగారు పతకాన్ని అందించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన భారత స్టార్ రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయితేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటామని..