Home / arrest warrant
పలుకేసుల్లో వివిధ మంత్రులకు కోర్టులు ఇటీవల కాలంలో అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ కు కళ్యాణదుర్గం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి పశ్చిమ బెంగాల్‌లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
తమ వెబ్ సిరీస్ ‘XXX’ సీజన్ 2లో భారతీయ ఆర్మీ సైనికులను అవమానించి, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసినందుకు సినీ మరియు టెలివిజన్ నిర్మాత ఏక్తా కపూర్ మరియు ఆమె తల్లి శోభా కపూర్‌లకు బీహార్‌లోని బెగుసరాయ్‌లోని స్థానిక కోర్టు బుధవారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే పై మరొక వ్యక్తిని బలవంతం చేశాడనే ఆరోపణల పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిని సస్పెండ్ చేసింది. ఖాట్మండు పోలీస్ స్టేషన్‌లో లామిచానేపై ఫిర్యాదు నమోదయింది