Home / AP Politics
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటం పర్యటనలో భాగంగా కారుపై కూర్చుని వెళ్లడాన్ని చూపిస్తూ ర్యాష్ డ్రైవింగ్ కింద పవన్ పై నిన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పవన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.
నేడు ప్రధాని మోదీ రెండు రోజులు ఏపీ పర్యటనలో భాగంగా నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గవర్నర్ - సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా భేటీ కానున్నారు.
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. "వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం" అని పవన్ హెచ్చరించారు.
నేడు జనసేనాని ఇప్పటం గ్రామంలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా పవన్ ను అరెస్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీ పై మాజీ మంత్రి కోడలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 45 సీట్లు అడుగుతున్నాడు కాబట్టి చంద్రబాబే అతన్ని చంపాలని చూస్తాడంటూ కొడాలి ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, పార్టీ కార్యాలయం మరియు ఆయన నివాసం వద్ద పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడుతున్నారని ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ సంచలన అంశాలను మీడియా వేదికగా వెల్లడించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడి అరెస్ట్ విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.