Home / AP High Court
ఏపీ అసైన్డ్ భూముల కేసులో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో వాదనలు పూర్తి కావడంతో ఏపీ హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ అసైన్డ్ భూముల కేసులో కొత్త ఆధారాలు దొరికాయంటూ ఏపీ సిఐడి కోర్టు దృష్టికి తెచ్చింది. ఆడియో ఆధారాలని సిఐడి అధికారులు సమర్పించారు. రేపు వీడియో ఆధారాలు అందజేస్తామని సిఐడి చెప్పింది.
అంగళ్ళు విధ్వంసం కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోమ పలువురికి బెయిల్ మంజూరయిన సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మూడు కేసుల్లోను ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ హైకోర్టు మూడింటిని కొట్టివేసింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే నెల 4వ తేదీ వరకు లోకేష్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
తెదేపా చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 5 వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. బుధవారం నాడు ఏసీబీ కోర్టు ప్రారంభం అయిన తర్వాత సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సాగుతున్నందున కొంత సమయం ఇవ్వాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తిని చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. సిఐడి తరపు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి పిటిషన్ ను కొట్టేసింది.
AP High Court : జగన్ సర్కారుకి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ తాజాగా తీర్పు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అమరావతి పరిధిలో భూ పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ తరరపు ఇచ్చింది. మరి హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ […]
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో జగన్ సర్కారుకు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.
అమరావతి R5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. R5 జోన్‌పై రైతుల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. R5 జోన్ లో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించటంపై జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు పిటిషన్ వేశారు. అయితే.. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులోమాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు