Home / AP High Court
అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విశాఖలోని రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది.
రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి టు అరసవళ్లి పాదయాత్రను కొనసాగించవచ్చంటూ హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్ధానం కొట్టేసింది. రైతుల పాదయాత్రకు అనుమతిచ్చింది.
రైతుల తలపెట్టిన పాదయాత్ర పై ఇటు ప్రభుత్వం, అటు రైతుల పిటిషన్ల పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని న్యాయవాదులు కోరారు.
రాష్ట్రంలోని కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యడానికి హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మిశ్ర ఆదేశాలు జారీచేశారు. రాష్ర్టంలో భారీగా ఉద్యోగాల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. 3,673 పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది.
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రలో 600మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన బాధ్యతలు చూసేలా పోలీసులు చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
ఏపీ హైకోర్టు అనుమతితో అమరావతి టు అరసువల్లి కి చేపట్టిన రాజధాని రైతుల జేఎసి పాదయాత్రను పదే పదే వైకాపా నేతలు అడ్డుకోవడంపై రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రేపటిదినం త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది.