Home / ap assembly elections
ఏపీ అసెంబ్టీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దుమ్మురేపింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూడా జనసేన ఈ స్దాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలు తారుమారు చేసాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పార్టీ పరాజయం మింగుడు పడటం లేదు. తమ పార్టీ అమలు చేసిన సంక్షేమ పధకాలతో ప్రతీ కుటుంబం లబ్దిపొందిందని అందువలన గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్మారు.
ఏపీ లో ప్రజల నాడీ ఏ సర్వే సంస్థలకు చిక్కలేదు మిశ్రమ ఫలితాలను అందించాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ .కొన్ని ఏకపక్షంగా వైసీపీ కి అనుకూలంగా ఉంటే ,మరి కొన్ని సంస్థలు కూటమికి అనుకూలంగా ఫలితాలు వుంటాయని ప్రకటించాయి
తమ గ్రామానికి రోడ్డు లేదని కొందరు ,తమ పంటకు గిట్టుబాటు ధర లేదని కొందరు ,తమ గ్రామాన్ని ఎవరు పట్టించుకోలేదని కొందరు ఎన్నికలను బహిష్కరిస్తుంటే . మరోవైపు పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు సరైన దారిలేకపోయినా వాగులు వంకలు దాటుకుని ఓటు వేస్తున్నారు.
ఏపీలో ఓటరు చైతన్యం పోటెత్తుతోంది. ఉదయం పదకొండు గంటలవరుకు 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జన సందడి నెలకొంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రాబోతోందని కాపు, బలిజ సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు. తన అంచనాల గురించి 6 నిమిషాల నిడివిగల వీడియో రిలీజ్ చేశారు.