Home / Amul
కర్నాటక ఎన్నికల ముందు అమూల్ వర్సెస్ నందిని వివాదరం రేగిన కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తమిళనాడు రాష్ట్ర సహకార సంస్థ అయిన ఆవిన్ పాల సమాఖ్య నుంచి అమూల్ పాలను సేకరించకుండా ఆపాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
:కర్ణాటక రాష్ట్రంలో అమూల్ ప్రవేశం రాజకీయ వేడిని రగిలించింది. స్థానిక ప్రఖ్యాత పాల బ్రాండ్ నందిని ని రక్షించుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలు పిలుపు నిచ్చాయి. ఒక పధకం ప్రకారం ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ను దెబ్బతీసేందుకే అమూల్ ను తీసుకు వచ్చిందంటూ ఆరోపిస్తున్నాయి.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గుజరాత్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశించడంపై అధికార బిజెపి పార్టీతో జెడి (ఎస్) మరియు కాంగ్రెస్‌లు వాగ్వాదానికి దిగాయి. నందిని బ్రాండ్ పేరుతో రాష్ట్రంలో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు ప్రతిపక్ష రాజకీయ నేతలు మద్దతు పలుకుతున్నారు.