Home / Amit Shah
డీఎంకేను వంశపారంపర్య పార్టీగా అభివర్ణించిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉంధయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా తన కుమారుడు జై షా స్దానాన్ని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 15 న అమిత్ షా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది.
తెలంగాణలో పాగా వేసేందుకు గాను ఏ అవకాశాన్ని వదులుకోరాదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తనవైపు తిప్పుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై బీజేపీ దృష్టి సారించింది
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 15 వ తేదీన భద్రాచలంలో అమిత్ షా పర్యటన ప్రారంభమవుతుంది.
భారత అగ్రశ్రేణి రెజ్లర్ల ప్రతినిధి బృందం శనివారం హోంమంత్రి అమిత్ షాతో రాజధానిలోని ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తమ నిరసన గురించి మాట్లాడేందుకు ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు
మణిపూర్‌లో దోచుకున్న ఆయుధాలను తిరిగి ఇవ్వమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రజలను హెచ్చరించిన తరువాత, శుక్రవారం 140కి పైగా ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. ఆయుధాల కోసం త్వరలో కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభిస్తామని, ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అమిత్ షా హెచ్చరించారు.
మణిపూర్‌లో అల్లర్లు, హింసాత్మక సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. గురువారం ఇంఫాల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు.
మణిపూర్‌లో చెలరేగిన హింసపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ITLF) కార్యదర్శి మువాన్ టోంబింగ్ కు హామీ ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో విచారణ చేపడతామని, ప్రజలు శాంతియుతంగా ఉండాలని అమిత్ షా కోరారు.
మణిపూర్‌కు చెందిన పదకొండు మంది క్రీడా ప్రముఖుల బృందం రాష్ట్రంలోని ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ పంపింది. సంతకం చేసిన వారిలో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను కూడా ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు