Home / Amit Shah
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.సెప్టెంబర్ 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న (ఆదివారం) తెలంగాణ పర్యటనకు రానున్నారు. అదే రోజు సాయంత్రం ఖమ్మం లో జరిగే బీజేపీ రైతు సభ లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భద్రాచలం రాములవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తన ప్రేమికుడు సచిన్ మీనాతో కలిసి ఉండేందుకు అక్రమంగా సరిహద్దులు దాటిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర అగ్రనేతలకు రాఖీలు పంపినట్లు తెలిపింది.
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు ఫెయిల్ అయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.
డీఎంకేను వంశపారంపర్య పార్టీగా అభివర్ణించిన హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉంధయనిధి స్టాలిన్ ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిగా తన కుమారుడు జై షా స్దానాన్ని ఆయన ప్రశ్నించారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూలై 15 న అమిత్ షా ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది.
తెలంగాణలో పాగా వేసేందుకు గాను ఏ అవకాశాన్ని వదులుకోరాదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తనవైపు తిప్పుకోవడానికి గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై బీజేపీ దృష్టి సారించింది
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆయన త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 15 వ తేదీన భద్రాచలంలో అమిత్ షా పర్యటన ప్రారంభమవుతుంది.
భారత అగ్రశ్రేణి రెజ్లర్ల ప్రతినిధి బృందం శనివారం హోంమంత్రి అమిత్ షాతో రాజధానిలోని ఆయన అధికారిక నివాసంలో సమావేశమైంది.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తమ నిరసన గురించి మాట్లాడేందుకు ఒలింపిక్స్‌లో పాల్గొన్న రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ మరియు వినేష్ ఫోగట్ హోం మంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు