Home / Amaravathi JAC
అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్రలో 600మంది మాత్రమే పాల్గొనాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన బాధ్యతలు చూసేలా పోలీసులు చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.
అమరావతి నుండి అరసవళ్లి వరకు తలపెట్టిన అమరాతి రాజధాని రైతుల పాదయాత్ర ప్రారంభం నాటి నుండి వైకాపా శ్రేణులు పదే పదే వారిని రెచ్చగొడుతున్నారు. విధ్వంసానికి కవ్విస్తున్నారు. నేడు రాజమహేంద్రవరంలో పాదయాత్ర చేస్తున్న రైతులపై నీళ్ల బాటిళ్లు, చెప్పులు విసిరి వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు నానా యాగీ చేశారు.
రాష్ట్రంలో అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రాజధాని రైతులు తలపెట్టిన మహా పాద యాత్రను అడ్డుకొంటామని వైకాపా శ్రేణులు, మంత్రులు పదే పదే చెబుతున్న దానిపై అమరావతి జేఏసీ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది
అమరావతి నుండి అరసవల్లి వరకు తలపెట్టిన అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజధాని నిర్మాణం కొరకు నాడు భూములు లిచ్చిన రైతులు, రైతు కూలీలు రాజధానిగా ఎందుకు అమరావతినే కోరుకుంటున్నామో తెలుపుతూ పాదయాత్రలో తమ పాత్రను పోషిస్తున్నారు
అమరావతి నుండి అరసవల్లి వరకు తలపెట్టిన రాజధాని రైతుల రెండవ మహా పాదయాత్ర 14రోజున కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుండి ప్రారంభించారు
ఉద్యమాలతో దేశ స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమ స్పూర్తే ఎన్నో ప్రజా సమస్యలకు ఓ చుక్కాని. ఉద్యమ ఉద్దేశాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాని ప్రభావం అంతకు అంత పెరుగుతుందే గాని తగ్గదు.