Home / Alpha Hotel
ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రోజు తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నారు. సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్, సందర్శిని హోటల్స్ లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో నగరంలో ప్రసిద్ది గాంచిన హోటల్ లలో ఆల్ఫా హోటల్ గురించి అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉండే ఆల్పా హోటల్‌కు నిత్యం వేల మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. టీ, కాఫీ లతో పాటు బిర్యానీ వరకు అన్ని ఇక్కడ లభిస్తాయి. అయితే అనూహ్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సెప్టెంబర్ 17 వ తేదీన ఈ హోటల్ ను సీజ్ చేశారు.