Home / Agniveers
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలకు కోటి రూపాయలకు పైగా ఆర్దికసాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తంలో రూ. 48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ బీమా, రూ. 44 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు, అగ్నివీర్ అందించిన సేవా నిధిలో 30 శాతం, ప్రభుత్వం నుండి సమానమైన సహకారం మరియు విరాళాలపై వడ్డీ ఉన్నాయి.
రైల్వే శాఖ తన వివిధ విభాగాల కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అగ్నివీర్లకు నాన్-గెజిటెడ్ పోస్టులలో 15 శాతం రిజర్వేషన్ను అందిస్తుంది. వారికి వయస్సు సడలింపు మరియు ఫిట్నెస్ పరీక్షల నుండి మినహాయింపును కూడా అందజేస్తుందని సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపును కూడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.