Last Updated:

IPL 2023 RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత బ్యాటింగ్

ఐపీఎల్ 16 సీజన్ లో మరో ఆస్తికర మ్యాచ్ జరగనుంది. జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌ తో చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడుతోంది.

IPL 2023 RR vs CSK: టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత బ్యాటింగ్

IPL 2023 RR vs CSK: ఐపీఎల్ 16 సీజన్ లో మరో ఆస్తికర మ్యాచ్ జరగనుంది. జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌ తో చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడుతోంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఐపీఎల్ లో ఇరు జట్లు ఇప్పటివరకు 27 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 15 సార్లు విజయం సాధించింది. జైపూర్ స్టేడియంలో రాజస్థాన్, చెన్నై మధ్య 7 మ్యాచ్ లు జరుగగా.. రాజస్థాన్ 4 సార్లు, చెన్నై 3 సార్లు విజయం సాధించింది. ఈ ఐపీఎల్ 16 లో రాజస్థాన్ ఇప్పటి వరకు 7 మ్యాచుల్లో 4 విజయాలు, 3 ఓటములతో పాయింట్స్ టేబుల్ లో 3 వ స్థానంలో ఉంది. సీఎస్కే 7 మ్యాచుల్లో 5 విజయాలు , రెండు ఓటములతో అగ్రస్థానంలో ఉంది.

 

 

తుది జట్లు(IPL 2023 RR vs CSK)

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్