GT Vs RR: గుజరాత్ భారీ స్కోర్.. రాజస్థాన్ లక్ష్యం 178 పరుగులు
GT Vs RR: ఇండియన్ ప్రీమియర్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
GT Vs RR: గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో గిల్, డెవిడ్ మిల్లర్ రాణించారు. రాజస్థాన్ బౌలింగ్ లో సందీప్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. చాహల్, జంపా, బౌల్డ్ తలో వికెట్ తీశారు.
LIVE NEWS & UPDATES
-
GT Vs RR: గుజరాత్ భారీ స్కోర్.. రాజస్థాన్ లక్ష్యం 178 పరుగులు
గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటింగ్ లో గిల్, డెవిడ్ మిల్లర్ రాణించారు. రాజస్థాన్ బౌలింగ్ లో సందీప్ శర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. చాహల్, జంపా, బౌల్డ్ తలో వికెట్ తీశారు
-
GT Vs RR: నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. సందీప్ శర్మ బౌలింగ్ లో శుభ్ మన్ గిల్ క్యాచ్ ఔటయ్యాడు. గిల్ 34 బంతుల్లో 45 పరుగులు చేశాడు.
-
GT Vs RR: ముగిసిన 12వ ఓవర్.. 100 పరుగులు చేసిన గుజరాత్
12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ మూడు వికెట్లకు 100 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం డెవిడ్ మిల్లర్, శుభ్ మన్ గిల్ ఉన్నారు.
-
GT Vs RR: గుజరాత్ మూడో వికెట్ డౌన్.. పాండ్యా ఔట్
గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన పాండ్యా.. చాహల్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.
-
GT Vs RR: ముగిసిన పవర్ ప్లే.. 42 పరుగులు చేసిన గుజరాత్
గుజరాత్ పవర్ ప్లే లో తడబడింది. 6 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్, పాండ్యా ఉన్నారు.
-
GT Vs RR: రెండో వికెట్ డౌన్.. రనౌట్ అయిన సాయి సుదర్శన్
గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగుల వద్ద సాయి సుదర్శన్ రనౌటయ్యాడు.
-
GT Vs RR: రెండో ఓవర్.. 5 పరుగులు చేసిన గుజరాత్
రెండో ఓవర్లో గుజరాత్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు.
-
GT Vs RR: తొలి వికెట్.. డకౌట్ అయిన వృద్దిమాన్ సాహా
గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో సాహా డకౌట్ అయ్యాడు.
-
GT Vs RR: రాజస్థాన్ బౌలింగ్.. జట్టు ఇదే
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవి చంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, చాహెల్
-
GT Vs RR: గుజరాత్ బ్యాటింగ్.. టీం ఇదే
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ