Last Updated:

IND vs BAN: మొదటిటెస్ట్ లో 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసిన భారత్

భారత్ -బంగ్లాదేశ్ ల మద్య ఛటోగ్రామ్‌ టెస్టులో తొలిరోజు టీమ్‌ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది

IND vs BAN: మొదటిటెస్ట్ లో  6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసిన భారత్

IND vs BAN: భారత్ -బంగ్లాదేశ్ ల మధ్య మొదటి టెస్టులో తొలిరోజు టీమ్‌ఇండియా 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (82 బ్యాటింగ్‌; 169 బంతుల్లో 10×4) అజేయంగా నిలిచాడు. చెతేశ్వర్‌ పుజారా (90; 203 బంతుల్లో 11×4) రిషభ్ పంత్‌ (46; 45 బంతుల్లో 6×4, 2×6) తమ దైన శైలిలో ఆడి బంగ్లా బౌలర్లను ఎదుర్కొన్నారు.

మొదట బ్యాటింగుకు దిగిన టీమ్‌ఇండియా ఆరంభంలో తడబడింది. కేఎల్‌ రాహుల్‌ (22; 54 బంతుల్లో 3×4), శుభ్‌మన్‌ గిల్‌ (20; 40 బంతుల్లో 3×4) కేవలం 4 పరుగుల వ్యవధిలో ఔటయ్యారు. మరికాసేపటికే రాహుల్‌, విరాట్ కోహ్లి ఇద్దరూ ఔటయ్యారు. లంచ్ బ్రేక్ తరువాత రెండో సెషన్లో చెతేశ్వర్‌ పుజారా, రిషభ్ పంత్‌ అద్భుతంగా ఆడారు. నాలుగో వికెట్‌కు 73 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం అందించారు. పంత్‌ అంతర్జాతీయ క్రికెట్లో 4000 పరుగులు మైలురాయి అధిగమించాడు.

పంత్ అవుట్ అయ్యాక శ్రేయస్ అయ్యర్ రాకతో ఆట ఒక్కసారిగా మారింది. వీరిద్దరూ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. పుజారా 125 బంతుల్లో, శ్రేయస్‌ 93 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసారు. మరో 10 బంతుల్లో సెంచరీ చేస్తాడనగా పుజారా బౌల్డ్‌ అయ్యాడు. తరువాత వచ్చిన అక్షర్‌ పటేల్‌ (14) ఔటవ్వడతో ఆట ముగిసింది.బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం (3/84) 81 పరుగులకు మూడు వికెట్లు ఖలీద్ అహ్మద్ (1/26), మెహిదీ హసన్ మిరాజ్ (2/71) వికెట్లు పడగొట్టారు.

ఇవి కూడా చదవండి: