Champions Trophy 2025: నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ.. తొలి మ్యాచ్ పాకిస్థాన్‌తో న్యూజిలాండ్

Champions Trophy 2025 Starts Today onwords: ఛాంపియన్స్ ట్రోఫీ నేటి నుంచి మొదలు కానుంది. ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది, మొత్తం టోర్నీలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఉన్నాయి. ఇందులో ఇరు గ్రూప్‌ల్లో నుంచి తొలి రెండు జట్లు సెమిస్‌కు చేరుతాయి. భారత్ తొలి మ్యాచ్ రేపు బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీని రెండు సార్లు ఆస్ట్రేలియా విజేతగా నిలవగా.. భారత్ 2013లో విజేతగా నిలిచింది. అంతకుముందు 2002లో భారత్, శ్రీలంకలకు సంయుక్తంగా విజేతలుగా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక, 1998లో దక్షిణాఫ్రికా, 2000లో న్యూజిలాండ్, 2002లో భారత్, శ్రీలంక, 2004లో వెస్టిండీస్, 2006లో ఆస్ట్రేలియా, 2009లో ఆస్ట్రేలియా, 2013లో భారత్, 2017లో పాకిస్థాన్ కైవసం చేసుకున్నాయి.
అయితే 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడగా.. తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనలో భారత్ 2 ఓవర్లలో 14 పరుగులు చేయగా.. వర్షం పడింది. దీంతో మళ్లీ మ్యాచ్‌ను కొత్తగా ప్రారంభించారు. అయితే మరోసారి బ్యాటింగ్ చేసిన శ్రీలకం 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఛేదనలో భారత్.. 8.4ఓవర్లలో వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. అయితే మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా క్రికెట్ బోర్డు ప్రకటించింది.