Kabzaa Movie Review : ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న మూవీ ‘కబ్జ’. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్, సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ, మురళీ శర్మ లాంటి టాప్ స్టార్ కాస్ట్‌తో వచ్చిన ఈ సినిమాపై కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్లపై తెలుగులో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 17న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా పోస్టర్, టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ చిత్రాన్ని కేజీఎఫ్ సినిమాతో పొలుస్తూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేజీయఫ్, కాంతారల తర్వాత కన్నడ నుంచి వస్తున్న పెద్ద సినిమాలు దేశంలోని అన్ని భాషల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో నేడు రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందో.. లేదో.. ప్రత్యేకంగా మీకోసం ???
సినిమా కథ..
1945 నుంచి 1975 మధ్య కాలంలో జరుగుతుంది ఒక వ్యక్తి జీవితమే ఈ కథ. ఆర్కేశ్వర (ఉపేంద్ర) పైలట్ కావాలనే లక్ష్యంతో ఉంటాడు. అతని తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో మరణిస్తాడు. తల్లి (సుధ) తనను కష్టపడి పెంచుతుంది. ఆర్కేశ్వరుడికి సంకేశ్వరుడనే అన్న కూడా ఉంటాడు. అమరాపురం యువరాణి మధుమతి (శ్రియ), అర్కేశ్వర ప్రేమించుకుంటారు. కానీ అమరాపురం మహారాజు, మధుమతి తండ్రి అయిన వీర బహదూర్ (మురళీ శర్మ) తన కూతురిని రాజ కుటుంబంలోని వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అన్న మరణించడంతో సౌమ్యుడైన ఆర్కేశ్వర కత్తి పట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో జరిగిన మలుపులు ఏంటి? అతనికి పోలీస్ ఆఫీసర్ భార్గవ్ బక్షి (సుదీప్), గుర్తు తెలియని పాత్ర పోషించిన (శివరాజ్ కుమార్) మధ్య సంబంధం ఏంటి?? చివరకు ఆర్కేశ్వర జీవితంలో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే.. సినిమా చూడక తప్పదు.
ఇటీవల కాలంలో కానంద పరిశ్రమ ఊహించని రీతిలో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్, కాంతారా చిత్రాలు దేశ వ్యాప్తంగా ఎంతటి మానియా క్రియేట్ చేసాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఉపేంద్ర సినిమాలకి ఉండే హైప్ మామూలుది కాదు. అలాంటిది ఏకంగా ఈ సినిమాలో ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ ఉండడంతో స్టార్ హీరోలు ముగ్గురు ఒకే సినిమాలో ఉన్నారనే వార్తే అభిమానులకు సగం పిచ్చెక్కించింది. అయితే మొదటి నుంచి ఈ చిత్రాన్ని కేజీఎఫ్ తో పోలుస్తూ వార్తలు వస్తున్న క్రమంలో కొంత నిరాశ ఎదురైనప్పటికి.. సినిమా చూడాలని మాత్రం అంతా భావించారు. అయితే కథ పరంగా చూస్తే గొడవలకు చాలా దూరంగా ఉండే ఒక సౌమ్యుడు, సామాన్యుడు కరడు గట్టిన మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడనేదే కథ. నాటి భాషా నుంచి నేటి కేజీఎఫ్ వరకు సేమ్ స్టోరీ.. కానీ చెప్పే విధానం.. చూపించ దాన్ని బట్టి ప్రేక్షకుల మనస్సు గెలుచుకోగలుగుతాం.
ఈ సినిమాని కేజీయఫ్ తరహాలోనే ఉపేంద్ర కథను సుదీప్ నెరేట్ చేస్తుండటంతో సినిమా మొదలవుతుంది. ముందుగా సుదీప్ ఇంట్రడక్షన్, ఆ వెంటనే ఒక ఫ్లాష్‌బ్యాక్, తర్వాత ఉపేంద్ర ఎంట్రీ, శ్రియ ఎంట్రీ.. ఇలా సీన్లన్నీ కథ ఫ్లోతో పేర్చుకుంటూ వెళ్లిపోయారు. సినిమా ఎండింగ్ కూడా చాలా అబ్సర్డ్‌గా ఉంటుంది. కథను సగంలో వదిలేసి, అది కూడా యాక్షన్ సీన్ మధ్యలో ఎండ్ కార్డు వేసి మిగతాది ‘కబ్జ 2’లో చూసుకోండి అనేశారు. శివరాజ్ కుమార్ పవర్‌ఫుల్ కామియోతె మంచి హై ఇచ్చినా థియేటర్ నుంచి కొంచెం వెలితిగానే బయటకు వస్తాం.
ఇక ఈ సినిమా మొత్తం దాదాపు కేజీయఫ్ ఫ్లేవర్ ఏ కనిపిస్తుంది. వీరి ప్రయత్నంలో తప్పు లేదు కానీ.. కొద్ది కాలం క్రితమే ఒక విషయాన్ని అనుభూతి చెందిన ప్రేక్షకుడు.. మళ్ళీ అదే రీతిలో అదే అనుభూతిని పొందాలంటే కొంతమార్పు అవసరం. ఆ మార్పు ఈ సినిమాలో కొరవడింది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కేజీఎఫ్ సెట్లు, కేజీయఫ్ తరహా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కేజీయఫ్ తరహా ఎడిటింగ్ ప్యాటర్న్.. ఇలా కేజీయఫ్ ఫ్లేవర్ తగులుతూనే ఉంటుంది. వీటికి తోడు డబ్బింగ్ మీద కూడా కొచ్చేం శ్రద్ద పెట్టాల్సింది.
ఎవరెలా చేశారంటే..
ఉపేంద్ర నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ చిత్ర పరిశ్రమకి ఉన్న గొప్ప నటుల్లో ఆయన కూడా ఒకరు. సుదీప్ రెండు సన్నివేశాల్లో, శివరాజ్ కుమార్ ఒక సీన్లో కనిపించి కావాల్సినంత హైప్ ఇస్తారు. చాలా కాలం తర్వాత శ్రియకు మధుమతి రూపంలో మంచి పాత్ర లభించింది. కొన్ని సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది. ఉపేంద్రకు తల్లిగా సుధ బాగా నటించారు. కోట శ్రీనివాసరావు ఒకటి రెండు షాట్లకు మాత్రమే పరిమితం అయ్యారు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. డైరెక్టర్ చంద్రు కొంచెం శ్రద్ద తీసుకోవాల్సింది. మ్యూజిక్ కూడా ఒకే అనిపిస్తుంది.
కంక్లూజన్..
కొత్తగా వచ్చిన పాత ప్రయత్నం.. నిరాశ తప్పదా ?