Last Updated:

Jailer Movie Review : సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్‌” మూవీ రివ్యూ..

Jailer Movie Review : సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్‌” మూవీ రివ్యూ..

Cast & Crew

  • రజనీకాంత్ (Hero)
  • రమ్యకృష్ణ (Heroine)
  • మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, సునీల్, వినాయకన్, మిర్నా మీనన్, తమన్నా, యోగిబాబు, వసంత్ రవి, నాగబాబు, తదితరులు (Cast)
  • నెల్సన్ దిలీప్ కుమార్ (Director)
  • సన్ పిక్చర్స్ (Producer)
  • అనిరుధ్ (Music)
  • విజయ్ కార్తీక్ కన్నన్ (Cinematography)
3

Jailer Movie Review : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా.. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “జైలర్‌”. ప్రముఖ నటులు మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా చేస్తుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో రజినీ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఇక ఒకవైపు తమన్నా ‘నువు కావాలయ్యా.. నువు కావాలయ్యా’ అంటూ ఊపేస్తూ.. ఆడియో ఈవెంట్ లో ‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతానే ఉండాలి.. అర్ధమైందా రాజా !!’ అంటూ రజినీ చెప్పిన డైలాగ్స్  నెట్టింట ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఇక రజినీకాంత్ సినిమా రిలీజ్ అంటే ఒక పండుగ అనే చెప్పాలి. తమిళనాట పలు ఆఫీసులకు సెలవులు కూడా ఇచ్చారు. ఇంత హైప్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ.. 

ముత్తు వేల్ పాండియన్ (రజనీకాంత్) రిటైర్డ్ జైలర్. భార్య విజయ (రమ్యకృష్ణ), కుమారుడు, కోడలు, మనవడితో శేష జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. ముత్తు కుమారుడు అర్జున్ (వసంత్ రవి) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. తండ్రి మార్గంలోనే అన్యాయాన్ని అస్సలు సహించని నిజాయతీ గల ఆఫీసర్. పురాతన దేవాలయాల్లో విగ్రహాలను చోరీ చేసే ముఠాను పట్టుకోవాలని నాలుగున్నరేళ్లుగా దర్యాప్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్జున్ మరణించాడని పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. తన కొడుకు ఏమయ్యాడు? చివరికి తన కుటుంబాన్ని ముత్తు ఎలా కాపాడుకున్నాడు? అసలు ముత్తు ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అన్నదే మిగిలిన జైలర్ (Jailer Movie) కథ.

మూవీ విశ్లేషణ ( Jailer Movie Review ).. 

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మంచి స్టోరీ పడితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ గత కొంతకాలంగా రజినీ వరుస సినిమాలు చేస్తున్నప్పటికి అవి మంచి విజయాన్ని దక్కించుకోలేకపోతున్నాయి. దీంతో అటు వైపు బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచిన నెల్సన్.. వరుస ఫ్లాప్ లతో ఉన్న రజినీ ఈ మూవీతో హిట్ కొట్టడం గ్యారంటీ అని అంతా భావించారు. అందుకు తగ్గట్టే మూవీ లోని సాంగ్, టీజర్, ట్రైలర్ లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే.. కథ రొటీన్ అని చెప్పడంలో సదేహం లేదు. యాక్షన్ ఎలిమెంట్‌తో రీవేంజ్ డ్రామాని ఆడియన్స్‌కి రీ కనెక్ట్ చేశారు. రజనీ మార్క్ స్టైల్‌తో రజనీ ఫ్యాన్స్‌లో ఊపు తెప్పించారు.

Image

ఆ తర్వాత కథనం కొంచెం ట్రాక్ తప్పినట్లు అనిపించినా.. ఇక మళ్ళీ క్లైమాక్స్ లో రజినీకాంత్ తో పాటు మోహన్ లాల్.. శివరాజ్ కుమార్.. కలిసి చేసిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాని సేఫ్‌లో పడేశాయి. స్టార్ హీరో ఇమేజ్‌లను దర్శకుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. వాళ్లు కనిపించేది కొద్దిసేపే అయినా.. పూనకాలు తెప్పించే యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్ కి మాస్ ఫీస్ట్ అందించారు. రజనీ, శివ్ కుమార్, మోహన్ లాల్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూస్తుంటే ఫ్యాన్స్‌కి పూనకాలు కన్ఫర్మ్ అని చెప్పాలి.  మొత్తానికి అయితే ఈ సినిమాతో రజినీ గట్టిగానే కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు.

స్క్రీన్ మీద ఆర్టిస్టులు సీరియస్ యాక్టింగ్ చేస్తుంటారు. కానీ, స్క్రీన్ ముందు ఉన్న ప్రేక్షకులకు నవ్వు ఆగదు. రజనీకాంత్ హీరోయిజాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ అద్భుతంగా చూపించారు. అందుకు మెయిన్ క్రెడిట్ సంగీత దర్శకుడు అనిరుధ్ కు ఇవ్వాలి. ఆయన నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను విపరీతంగా ఎలివేట్ చేశాయి. కొత్త సంగీతం వినిపించింది. సినిమాటోగ్రఫీ, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. ఎక్కడా రాజీ పడినట్లు కనిపించలేదు. విశ్రాంతి తర్వాత కథపై నెల్సన్ దిలీప్ కుమార్ కాన్సంట్రేట్ చేసుంటే ఫలితం కూడా రజనీకాంత్ ఇమేజ్ స్థాయిలో ఉండేది. అది జరగలేదు. కథలో ట్విస్టులు ఊహించడం కష్టం ఏమీ కాదు. అసలే కథలో రజనీకాంత్ హీరోయిజం తప్ప కొత్తదనం లేదు.

Jailer Rathamaarey Song: Rajinikanth as grandfather conveys beautiful  family bonding in the soulful track | PINKVILLA

ఎవరెలా చేశారంటే.. 

రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు విజిల్స్ వేసేలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన ఓల్డ్ మూవీస్ మేనరిజమ్స్ సైతం ఆకట్టుకుంటాయి. ఆయనకు జోడీగా రమ్యకృష్ణ హుందాగా కనిపించారు. వసంత్ రవి మరోసారి ఆకట్టుకుంటారు. ప్రతినాయకుడిగా వినాయకన్ నటన ఒకే. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్.. కథలో ముగ్గురి పాత్రల నిడివి చాలా తక్కువ అయినప్పటికీ.. ఉన్నంత సేపు మంచి ఎలివేషన్లు ఇచ్చారు. తమన్నా పాత్ర నిడివి కూడా తక్కువే ఉన్న ‘నువ్ కావాలయ్యా..’ తో కేకలు పెట్టించేశారు. తెలుగు నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. మెగా బ్రదర్ నాగబాబు అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. రజనీకాంత్, యోగిబాబు బాగా నవ్వించారు. ఆ కామెడీ సీన్లలో వాళ్ళిద్దరి టైమింగ్ బాగా కుదిరింది. అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. ‘జైలర్’‌ని ఓ రేంజ్‌లో నిలబెట్టింది. ముఖ్యంగా రజనీకాంత్ ఎలివేషన్స్ సీన్స్‌కి అనిరుధ్ బాదిన బాదుడు మామూలుగా లేదు. నెల్సన్ మొత్తానికి మళ్ళీ నిరూపించుకున్నాడు.

కంక్లూజన్..

జైలర్.. అందర్నీ వన్ మ్యాన్ షో తో లాక్ చేసేశాడు.

ఇవి కూడా చదవండి: