Last Updated:

Samajavaragamana Movie Review: కడుపుబ్బా నవ్వించే సినిమా.. “సామజవరగమనా” రివ్యూ ఇలా..!

Samajavaragamana Movie Review: కడుపుబ్బా నవ్వించే సినిమా.. “సామజవరగమనా” రివ్యూ ఇలా..!

Cast & Crew

  • శ్రీవిష్ణు (Hero)
  • రెబా మోనికా జాన్ (Heroine)
  • నరేష్ విజయకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, 'వెన్నెల' కిశోర్, రాజీవ్ కనకాల, రఘు బాబు, దేవి ప్రసాద్, ప్రియా తదితరులు (Cast)
  • రామ్ అబ్బరాజు (Director)
  • రాజేష్ దండ (Producer)
  • గోపీసుందర్ (Music)
  • రామ్ రెడ్డి (Cinematography)
3.5

Samajavaragamana Movie Review: యంగ్ హీరోలలో శ్రీ విష్ణు ది చాలా డిఫరెంట్ స్టైల్. శ్రీవిష్ణు కామెడీతో ఎంత నవ్వించగలరో అదే విధంగా భావోద్వేగాలతో మనసులను పిండెయ్యగలరు. ఇక శ్రీ విష్ణు చిత్రాలు చూస్తే.. మెజారిటీ హిట్లే. మరి, తాజాగా విడుదలైన ‘సామజవరగమన’ సినిమా ఎలా ఉందో? ఓ సారి చూసేద్దాం.

కథ: బాలు (శ్రీ విష్ణు) ఏషియన్ మల్టీప్లెక్స్ టికెట్ కౌంటర్ ఉద్యోగి. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ! బాబాయ్, మేనత్తలు బాగా రిచ్ గా ఉంటారు. బాలు తాతయ్య కోటీశ్వరుడు. పిల్లలకు తన ఆస్తి చెందాలంటే డిగ్రీ సర్టిఫికేట్ అందుకోవాలని కండిషన్ పెడతారు. దానితో కొడుకు ఉద్యోగం చేస్తున్నా కానీ.. తండ్రి (సీనియర్ నరేష్) డిగ్రీ పరీక్షలు రాస్తుంటాడు. 30 ఏళ్ళు అయినా పాస్ కాడు. తండ్రికి సప్లీ పరీక్షల్లో పరిచయమైన సరయు (రెబా మోనికా జాన్)తో ప్రేమలో పడతాడు బాలు.

విశ్లేషణ

‘సామజవరగమన’ కథలో పెద్ద విషయం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే డైరెక్టర్ రాసుకున్న కథను చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు. కామెడితో కడుపుబ్బా నవ్వించారు. ప్రేమ పేరుతో తనకు దగ్గర కావాలని చూసే అమ్మాయిలతో రాఖీ కట్టించుకునే బాలు.. సరయుతో ఎలా ప్రేమలో పడ్డాడు? ప్రేమించిన సరయు తనకు భార్యగా ఇంటికి వస్తుందని బాలు ఆశిస్తే… ఆఖరికి చెల్లి అవుతుందని తెలిసి ఏం చేశాడు? సరయు కుటుంబ నేపథ్యం ఏమిటి? చివరకు ఏమైంది? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? లేదా? అనేది సినిమా కథ.

కథ కంటే కామెడీపై దర్శక, రచయితలు ఎక్కువ కాన్సంట్రేషన్ చేశారు. ఇన్నాళ్ళూ చదవడం లేదని కొడుకులను తిట్టే తండ్రులను చూశాం. ఇప్పుడు ఈ సినిమాలో తండ్రిని కొడుకు తిడుతుంటే ఆ సీన్స్ కాస్త వెరైటీగా అనిపిస్తూ నవ్విస్తాయి.’సామజవరగమన’లో ఫొటోగ్రఫీ, కళా దర్శకత్వం.. రెండూ బావున్నాయి. గోపీ సుందర్ అందించిన సంగీతం జస్ట్ ఓకే. అయితే.. పాటల్ని అందంగా, కలర్ ఫుల్ గా రూపొందించారు. నిర్మాణ విలువలు బావున్నాయి.

నటీనటులు ఎలా చేశారంటే..
బాలు పాత్రలో శ్రీవిష్ణు జీవించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ అయితే సూపర్. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. శ్రీ విష్ణు, నరేష్ మధ్య సన్నివేశాలైతే బాగా వచ్చాయి.
హీరోయిన్ రెబా మోనికా జాన్కు తెలుగులో ఫస్ట్ సినిమా అయినా చాలా చక్కగా నటించింది. రాజీవ్ కనకాల మరోసారి ఎమోషనల్ పాత్రలో కనిపించారు. శ్రీకాంత్ అయ్యంగార్, ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్.. ముగ్గురూ నవ్వులు పూయించడంలో చాలా సక్సెస్ అయ్యారు.

మొత్తంగా చెప్పాలంటే ‘సామజవరగమన’ సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అవుతూ చూసే మూవీ. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రమిది.

 

ఇవి కూడా చదవండి: