Last Updated:

Ramabanam review: గోపిచంద్ హిట్టు కొట్టినట్టేనా.. ‘రామాబాణం’ ఎలా ఉందంటే?

Ramabanam review: గోపిచంద్ హిట్టు కొట్టినట్టేనా.. ‘రామాబాణం’ ఎలా ఉందంటే?

Cast & Crew

  • gopichand (Hero)
  • dimple hayathi (Heroine)
  • jagapathi babu, kushboo, nazar, ali, vennela kishore, sapthagiri (Cast)
  • sri vasu (Director)
  • vishwa prasad (Producer)
  • micky j mayor (Music)
  • palanisamy (Cinematography)
2.2

Ramabanam review: గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రామబాణం. డింపుల్ హయాతీ గోపిచంద్ కి జంటగా నటించింది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో గోపిచంద్ హిట్టు కొట్టినట్లేనా.. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?

నటినటులు.. గోపీచంద్, డింపుల్ హయాతీ, జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్ తదితరులు.

కథ ఏంటంటే..? (Ramabanam review)

ప్ర‌జ‌ల ఆరోగ్యమే ప‌ర‌మావ‌ధి భావిస్తాడు రాజారామ్ (జ‌గ‌ప‌తిబాబు). సంప్రదాయ వంటకాలతో.. త‌న ఊళ్లోనే సుఖీభ‌వ పేరుతో హోట‌ల్ న‌డుపుతుంటాడు.

సంప్రదాయ వంటలను తయారు చేస్తూ.. తక్కువ ధరలకే వాటిని విక్రయిస్తాడు. తక్కువ ధరకు విక్రయించడం వ్యాపారంలో పోటీదారుల‌కి నచ్చదు.

దీంతో జీకే (త‌రుణ్ అరోరా), అత‌ని మామ (నాజ‌ర్‌) సుఖీభ‌వ హోట‌ల్‌పై దాడి చేసి లైసెన్స్ ను తీసుకెళ్తారు.

అదే రోజు రాత్రి.. రాజారామ్ తమ్ముడు విక్కీ (గోపీచంద్‌) విలన్ ఇంటికెళ్లి లైసెన్స్ తీసుకొస్తాడు. ఇది నచ్చని రాజారామ్ తమ్ముడిన నచ్చచెబుతాడు.

చట్ట పరిధిలోనే చేయాలని పోలీసులకు అప్పగించాలని చూస్తాడు. ఇలాంటి పనులు జీవితంలో ఎదగడానికి అడ్డంకులుగా మారతాయని వివరిస్తాడు.

వెంటనే విక్కీ తాను గొప్పవాడిగా ఎదిగి తిరిగొస్తానని.. కలకత్త వెళ్లిపోతాడు.

కోల్ కతా వెళ్లిన విక్కీ ఏం చేశాడు? ప‌దిహేనేళ్ల త‌ర్వాత తిరిగి రావ‌ల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కి ఎందుకొచ్చింది? అనేదే అస‌లు క‌థ‌.

రోటిన్ స్టోరీ..

ప్రస్తుతం పాతకథల్ని దర్శకులు కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

కుటుంబ క‌థ‌లు ఇప్పుడు రావ‌డం లేదు క‌దాని.. ద‌శాబ్దాల కింద‌టే చూసేసిన క‌థ‌ల్ని అదే ఫార్ములాతో ఇప్పుడు తెర‌పైకి తీసుకొస్తామంటే కుద‌ర‌దు.

కానీ, రామ‌బాణం విష‌యంలో అదే జరిగింది.

సేంద్రీయ ఉత్ప‌త్తులు, సంప్ర‌దాయ ఆహారం అంటూ ఓ కొత్త నేప‌థ్యాన్ని ఎంచుకున్నారు. త‌గిన తారాగ‌ణం, కావ‌ల్సినంత బ‌డ్జెట్ ఉంద‌ని తెర‌పైన హంగులే చెబుతున్నాయి.

కానీ చిత్రాన్ని మ‌లిచిన విధానం మాత్రం పేల‌వంగా ఉంది. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒక్క స‌న్నివేశంలోనూ కొత్త‌ద‌నం లేదు.

ప్రేమ, కుటుంబ అనుబంధాలు, డ్రామా, ఆలోచ‌నని రేకెత్తించ‌గ‌లిగే నేప‌థ్యం.. ఇలా అన్నీ ఉన్న క‌థే అది.

అయినా స‌రే మ‌న‌సుల్ని హ‌త్తుకునే భావోద్వేగాలు కానీ, కాసింత హాస్యం పంచే స‌న్నివేశాలు కానీ మ‌చ్చుకైనా క‌నిపించ‌వంటే ఈ స్క్రిప్ట్, ద‌ర్శ‌క‌త్వం ఎంత పేల‌వమో అర్థం చేసుకోవ‌చ్చు.

 

ఎవ‌రెలా చేశారంటే: గోపీచంద్ ఈ సినిమాలో స్టైలిష్ గా కనిపించారు. యాక్ష‌న్ ఘ‌ట్టాల్లోనూ మెప్పించాడు. జ‌గ‌పతిబాబుని ఈ మ‌ధ్య ప్ర‌తినాయ‌కుడిగానే ఎక్కువ‌గా చూస్తున్నాం.

కానీ ఇందులో సాత్వికంగా క‌నిపిస్తూ రాజారామ్ పాత్ర‌లో ఒదిగిపోయారు. ఈ సినిమాలో హీరోయిన్ కు ఎక్కువగా ప్రాధాన్యం లేదు. కేవలం పాటలకే పరిమితం చేశారు.

అలీ, వెన్నెల కిశోర్‌, స‌త్య‌, గెట‌ప్ శ్రీను, స‌ప్త‌గిరి గ్యాంగ్ చేసిన హంగామా ఏమాత్రం న‌వ్వించ‌దు. త‌రుణ్ అరోరా, నాజ‌ర్, రాజా ర‌వీంద్రతోపాటు క‌ల‌క‌త్తా విల‌న్లు త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లోనే క‌నిపించారు.

బ‌లాలు
+ ప‌తాక స‌న్నివేశాలు
+ సంప్ర‌దాయ ఆహార నేప‌థ్యం
బ‌ల‌హీన‌త‌లు
– కొత్త‌ద‌నం లేని క‌థ, క‌థ‌నాలు
– ఆస‌క్తి రేకెత్తించ‌ని స‌న్నివేశాలు
చివ‌రిగా: ఈ ‘రామబాణం’ గురితప్పింది!

 

ఇవి కూడా చదవండి: