Actor Nikhil : నన్ను కూడా డ్రగ్స్ తీసుకోమని ఆఫర్ చేశారు – హీరో నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కార్తికేయ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తనకు బాగా కలిసొచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి “స్పై” గా ఆడియన్స్ ముందుకు రానున్న నిఖిల్..
Actor Nikhil : యంగ్ హీరో నిఖిల్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కార్తికేయ ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తనకు బాగా కలిసొచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ నే నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి “స్పై” గా ఆడియన్స్ ముందుకు రానున్న నిఖిల్.. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నటు తెలుస్తుంది. ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అంతకు ముందు క్షణం, గూఢచారి, ఎవరు, హిట్-1,2 వంటి సస్పెన్స్ సినిమాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సమర్పణలో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దీనికి నిర్మాత రాజశేఖర్ రెడ్డినే కథను కూడా అందించడం విశేషం. ఇక ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా ఐశ్వర్య మీనన్ నటిస్తుంది.
అయితే తాజాగా డ్రగ్ దుర్వినియోగం, డ్రగ్స్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిర్వహించిన కార్యక్రమంలో నిఖిల్ సిద్దార్థ, ప్రియదర్శి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ వచ్చేది కాదు. ఆ తర్వాత కూడా అడిగారు, అప్పుడు కూడా తీసుకొని ఉంటే కార్తికేయ 2 వచ్చేది కాదు. పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. వాళ్ళని గమనించాలి. డ్రగ్స్ కి అందరూ దూరంగా ఉండాలి. నార్కోటిక్స్ కి అలవాటు పడితే అదే డెత్ సెంటన్స్. సే నో టూ డ్రగ్స్. స్టూడెంట్స్ కు ఎంతో భవిష్యత్ ఉంది. పార్టిస్ కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, కానీ డ్రగ్ తీసుకోకండి. త్వరలో డ్రగ్ ఫ్రీ తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
కాగా ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. స్పై మూవీ ఒక గూఢచారి కథ మాత్రమే కాదు ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ డేట్ మిస్టరీ గురించి కూడా ఆసక్తికర అంశాలు ఉన్నట్లు ట్రైలర్ తో అర్థం అయింది. కథలో కీలక అంశం కూడా అదే అని తెలుస్తోంది. నేతాజీ అదృశ్యం, మరణం పట్ల దేశం మొత్తం భిన్న వాదనలు, వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ట్రైలర్ చివర్లో ఓ డైలాగ్ ఉంటుంది.. స్వాతంత్రం ఎవరో ఇచ్చేది కాదు.. లాక్కునేది.. అని హీరో రానా చెప్పడం స్పెషల్ గా మారింది.