Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గా ఫేమస్ అయిన శిరీష్ అనే యువతి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గేదెలు కాస్తూ ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింపజేశాయి.
విశాఖ బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిలిచారు. ఇప్పటికే వారికి ఒక్కో కుటుంబానికి 50 వేలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆయా కుటుంబాలను ఆదుకోవాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ హార్బర్ కు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం వికారాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో అభ్యర్ధులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలని.. ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.
ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని.. దొరల పాలన కావాలా..? ఇందిరమ్మ పాలన కావాలా..? అని కాంగ్రెస్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని.. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే ఉండడంతో ప్రచారంలో ప్రధాన పార్టీలన్ని మరింత స్పీడ్ పెంచాయి. బీజేపీ అగ్రనేతలు అయిన మోదీ, అమిత్ షా ఇప్పటికే తెలంగాణలో ప్రచారం నిర్వహించగా.. ఇప్పుడు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. బుధవారం కొడంగల్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీకి రూ.50 లక్షలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తీరును గుర్తు చేశారు. జైలుకు వెళ్లినా రేవంత్ రెడ్డిలో మార్పు రాలేదని కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో జోష్ ఇచ్చే పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రీసెంట్ గానే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కూడా చేరారు. ఇప్పుడు తాజాగా మరో నటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో శిరీష బరిలోకి దిగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ యువతి బర్రెలక్కగా అందరికీ సుపరిచితురాలుగా మారింది.