Assam coal mine mishap: బొగ్గు గనిలో ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి
Three feared dead in Assam coal mine mishap: అస్సాం బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దిమా హసావ్ జిల్లాలోని ఓ గనిలో 9 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ మేరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, డైవర్స్, హెలికాప్టర్లు, ఇంజినీర్ల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమా హసావో జిల్లాలో ని బొగ్గు గనిలో పనిచేసే వారిలో 9మంది గని లోపలికి వెళ్లారు. ఈ సమయంలో గని లోపలి నుంచి నీరు ఉప్పొంగడంతో ఒక్కసారి ప్రవాహం పెరిగి బయటకు వచ్చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది లోపల చిక్కుకుపోవడంతో సహాయక కేంద్రాలు వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అప్పటికే మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, వారి మృతదేహాలను ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేదు. దీనిపై ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారి మయాంక్ కుమార్ స్పందించారు. గనిలోపల చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయక దళాలు, ఆర్మీ నుంచి రెస్య్కూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు.