Last Updated:

President of Bharath: G20 డిన్నర్‌ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రణ

ఇండియా అన్న పేరుని భారత్‌గా మార్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమైందా.? దానికి రంగం సిద్దం చేసిందా.? ఇండియా పేరిట కూటమి ఏర్పాటు చేసిన ప్రతిపక్షాలకి షాక్ ఇచ్చేందుకు మోదీ సర్కార్ ఎత్తులు వేస్తోందా అంటే అవున్న సమాధానమే వస్తోంది.

President of Bharath:  G20 డిన్నర్‌ ఆహ్వానంపై  ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రణ

President of Bharath: ఇండియా అన్న పేరుని భారత్‌గా మార్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమైందా.? దానికి రంగం సిద్దం చేసిందా.? ఇండియా పేరిట కూటమి ఏర్పాటు చేసిన ప్రతిపక్షాలకి షాక్ ఇచ్చేందుకు మోదీ సర్కార్ ఎత్తులు వేస్తోందా అంటే అవున్న సమాధానమే వస్తోంది.

భారత్‌ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే వీరికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానం అందింది. అయితే, ఈ ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ విమర్శలు..(President of Bharath)

తమకు అందిన ఆహ్వానంలో ఈ మార్పును గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. జీ-20 విందు కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో.. భారత్‌, అది ఇండియా, రాష్ట్రాల సమాఖ్య అని రాసి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ రాష్ట్రాల సమాఖ్యపైనా దాడి జరుగుతోంది అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు.