Home / జాతీయం
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో ప్రయాణీకులతో ఉన్న గూడ్స్ వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో మహిళలు, పిల్లలు సహా పది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పాతర్రా గ్రామానికి చెందిన బాధితులు తిరయ్య గ్రామంలో జరిగిన కుటుంబ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
మన దేశంలో ఎన్నికలంటే పండుగ వాతావరణాన్ని తలపిస్తాయి. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీ ప్రకటించిన వెంటనే చిన్న గ్రామాల నుంచి అతి పెద్ద నగరాల వరకు ఎన్నికల సందడి మొదలవుతుంది. రాజకీయ పార్టీల కార్యకర్తల హడావుడికి అంతే ఉండదు. బ్యానర్లతో , లౌడ్ స్పీకర్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో రెండో దశ పోలింగ్ ముగిసింది. శుక్రవారం నాడు కర్ణాటకలో పోలింగ్ జరిగింది.
డిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డిల్లీ మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న రెండు లక్షల మంది విద్యార్థులను గాలికి వదిలేశారని మండిపడింది. జాతీయ ప్రయోజనాలను పక్కన పెట్టి స్వంత ప్రయోజనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు లక్షల మంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, స్టేషనరీతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేయడంలో దిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కోర్టు ఆప్ ప్రభుత్వంపై మండిపడింది.
ఇటీవల కాలంలో విదేశాల నుంచి దేశంలోకి బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. మన హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో తరచూ బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దుబాయి నుంచి బంగారం కొనుగోలు చేసి ఇండియాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు
దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండవ విడత పోలింగ్ ముగిసింది. అయితే అందరి దృష్టి గాంధీలకు కంచుకోట అయిన అమెధీ, రాయబరేలిపై పడింది. ఈ రెండ నియోజకవర్గాల నుంచి రాహుల్, ప్రియాంకాగాంధీలు పోటీ చేయాలి. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే భయపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
దేశవ్యాప్తంగా భానుడు భగభగ మంటున్నాడు. సరాసరి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు కాగా కొన్ని చోట్ల 45 డిగ్రీలు దాటిపోయింది. ఉదయం పది దాటిందంటే ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే దక్షిణాది రాష్ర్టాల్లో నీటి ఎద్దడి క్రమంగా పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. నీటి నిల్వలు కేవలం 17 శాతానికి దిగివచ్చాయి.
రాజకీయాల్లో ఏదైనా సంభవమే అన్నట్లు ,ఎన్నికల్లో ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది .దీనిపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస రచయిత శివ్ ఖేరా సుప్రీంకోర్టు లో పిల్ వేశారు .ఎన్నికల్లో నోటా కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు . దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
వచ్చే నెల బ్యాంకు ఉద్యోగులకు సెలవులే.. సెలవులు. మొత్తానికి చూస్తే ఆయా రాష్ర్టాల్లో జాతీయ, ప్రాంతీయ సెలవులు కలుపుకొని సుమారు 14 రోజుల పాటు సెలవులు లభిస్తాయి. వాటిలో నాలుగవ శనివారాలతో పాటు ఆదివారాలు కూడా కలుపుకొని ఉన్నాయి. కాగా రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా మే నెల సెలవుల జాబితాను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా రెండో దశ లోకసభ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటు వేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే త్రిపురలోని మారుమూల ప్రాంతమైన దాలాయి జిల్లాను చెప్పుకోవచ్చు. ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బోటు ద్వారా ప్రయాణం చేసి ఓటు వేసి రావాల్సిందే.
దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందడి నెలకొంది. ఇక కర్ణాటకలోని బెంగళూరు విషయానికి వస్తే ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ ఆర్ నారాయణమూర్తి, ఆయన బార్య రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి, ఇండియన్ క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్‌లు శుక్రవారం పోలింగ్ ప్రారంభమైన వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.