Home / జాతీయం
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు సేలం జిల్లాలోని యార్కాడ్‌లో లోయలో పడి ఐదుగురు చనిపోయారని బుధవారం అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బస్సు సేలం నుంచి 56 మంది ప్రయాణికులతో బయలు దేరింది.
డిల్లీలోని 80కి పైగా స్కూళ్లు, మరియు నోయిడాలోని కనీసం రెండు స్కూళ్లకు బుధవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, దీంతో ఈ పాఠశాలలనుంచి విద్యార్దులను తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
లోకసభ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో చెప్పాలని సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. కాగా అరవింద్ కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మనుసింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోల జమానా నడుస్తోంది. మనిషిని పోలిన మనిషి తయారు చేయడం .. చెప్పని విషయాలు చెప్పినట్లు సృష్టించడం జరుగుతోంది. ఇటీవల కాలంలో సినీతారల డీప్ ఫేక్ వీడియోలు పెద్ద దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు డీప్ ఫేక్ వీడియోలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఊరు పేరు లేని వారికి ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు... రాజ్యసభ సీట్లు అప్పగించారు. అయితే కష్ట కాలంలో వెన్నంటి ఉండాల్సిన సమయంలో తన పార్టీ సహచరులే ఇప్పడు ముఖం చాటేస్తున్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దా మొదటివరుసలో ఉన్నాడు. పార్టీలోని ప్రతి ఒక్కరు చద్దా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం బాబా రాందేవ్‌కు చెందిన కంపెనీ పతంజలి ఆయుర్వే లిమిటెడ్, దివ్య ఫార్మసీపై కొరఢా ఝళిపించింది. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాందేవ్‌తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ ప్రొడక్టులతో అన్నీ రోగాలు మాయం అవుతాయని తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది.
: చత్తీస్‌గఢ్ మరోమారు రక్తమోడింది. తాజాగా మంగళవారం నాడు చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతాదళాలకు .. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కాగా నక్సల్స్‌ఏరివేత కార్యక్రమంలో జిల్లా రిజర్వ్ గార్డ్లు, స్పెషల్ టాక్స్ ఫోర్స్‌లు పాల్గొన్నాయని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందన్నారు.
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణం గురించి యావత్ దేశం చర్చించుకుంటోంది. లోకసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజ్వల్ శనివారం ఉదయం ఫ్రాంక్ఫర్ట్వెళ్లి పోయారు. ఆదివారం నాడు ప్రజ్వల్ కు చెందిన సుమారు 3వేల వీడియోలు కర్ణాటకలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ప్రజ్వల్ తండ్రి హెచ్డీ రేవన్న మాత్రం తన కుమారుడిని వెనకేసుకు వస్తున్నారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని దోపిడీ గ్యాంగ్ నడిపిస్తోందన్నారు. బెంగళూరు టెక్ హబ్.. దీన్ని కాస్తా కాంగ్రెస్ పార్టీ ట్యాంకర్ హబ్ గా మార్చిందని మండిపడ్డారు. కర్ణాటకలో 2జీ స్కామ్ లాంటి కుంభకోణాలు చేయాలని కలలు కంటున్నారని ప్రధాని మోదీ రాష్ర్టంలోని బాగల్ కోట్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ అన్నారు.
గుజరాత్ తీరంలో అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల డ్రగ్స్‌తో 14 మంది పాకిస్తానీ పౌరులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మరియు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) సంయుక్త ఆపరేషన్‌లో పాకిస్తాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.