Home / జాతీయం
కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ కార్యకర్తలు బెంగళూరు నగరంలో అన్ని సైన్‌బోర్డ్‌లపై '60% కన్నడ' అని డిమాండ్ చేస్తూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. .కొందరు కార్యకర్తలు షాపుల ముందు ఇంగ్లిష్ సైన్ బోర్డులను చింపివేయగా, మరికొందరు ఆంగ్ల అక్షరాలపై నల్ల ఇంకు చల్లారు.
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు నివేదించబడలేదు.పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీలో ఇద్దరు నిందితుల కదలికలను గుర్తించామని వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో బుధవారం 100కు పైగా దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యాయి.దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయం దాదాపు 110 విమానాలు (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకలు మరియు నిష్క్రమణలను ప్రభావితం చేస్తూ ఆలస్యాన్ని ఎదుర్కొంటోంది అని ఢిల్లీ ఎయిర్పోర్ట్ FIDS (ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్) తెలిపింది.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే జనవరి 14నుంచి మరోసారి పాదయాత్ర నిర్వహించనున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరిట జనవరి 14నుంచి మార్చి 20 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 21న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరోసారి రాహుల్ గాంధీ యాత్ర చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ తన యూట్యూబ్ ఛానెల్‌కు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగివున్న తొలి ప్రపంచ నేతగా నిలిచారు. ప్రధానమంత్రి యూట్యూబ్ ఛానెల్‌కు మొత్తం 20 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు, అందులో 23,000 వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయి.
INS ఇంఫాల్, ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక నగరం పేరు పెట్టబడిన మొట్టమొదటి యుద్ధనౌక భారత నౌకాదళంలోకి ప్రవేశించింది.మంగళవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో దీనిని భారత నావికాదళంలో ప్రవేశపెట్టిన సందర్బంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నౌక యొక్క చిహ్నాన్ని ఆవిష్కరించారు.
మధ్యప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం సోమవారం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాష్ విజయవర్గియా, విశ్వాస్ సారంగ్ సహా 18 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు
సూర్యగ్రహంపై పరిశోధనలకోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ వన్ సోలార్ మిషన్ 2024 జనవరి 6న తన లక్ష్యాన్ని చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. భూమికి లక్షన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న లంగ్రాజ్ పాయింట్ ఎల్ వన్‌కి మిషన్ చేరుతుందని సోమనాథ్ వివరించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ మరియు రాజౌరీ జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.గురువారం మధ్యాహ్నం పూంచ్‌లోని సురన్‌కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధేరా కి గాలీ మరియు బుఫ్లియాజ్ మధ్య ధాత్యార్ మోర్ వద్ద ఆర్మీ వాహనాలపై సాయుధ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై బజరంగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన సుదీర్ఘ లేఖను X లో షేర్ చేసారు. మహిళా రెజ్లర్లకు న్యాయం జరగకపోవడమే కారణమని ఈ లేఖలో పునియా పేర్కొన్నారు.