Home / జాతీయం
ఎట్టకేలకు దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ 'అగ్నిబాణ్'ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన అగ్నిబాణ్ ను షార్‌లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి గురువారం ఉదయం 7:15 గంటల సమయంలో రాకెట్‌ను సక్సెస్ ఫుల్‌గా ప్రయోగించారు.
దేశ రాజధాని ఢిల్లీ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఇవాళ 52.3 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు 49డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సగటు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటి పోయాయి. అలాగే రాజస్థాన్ లోని చురు, హర్యానాలోని సిర్సాతో సహా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డుగా నిలిచాయి.
రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరామ్ రాజన్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? గత కొంత కాలంగా రాజన్ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. డిసెంబర్ 2022లో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో రాజన్ రాహుల్‌తో కలిసి వెంట నడిచారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్తోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రాంరహీం సింగ్‌కు పంజాబ్, హర్యానా హైకోర్టులో మంగళవారం భారీ ఊరట లభించింది. డేరా మేనేజర్ రంజీత్‌సింగ్ హత్యలో కోర్టు డేరా చీఫ్‌తో పాటు మరో నలుగురిని నిర్దోషులుగా తీర్పు వెలువరించింది.
: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు బదిలీ చేశారు.
మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో కొండచరియలు విరిగి పడి సుమారు పది మంది మృతి చెందారు. జాతీయ రహదారి 6పై హంతూరు వద్ద రోడ్డుపై పెద్ద ఎత్తున బండ రాళ్లు పడ్డంతో జాతీయ రహదారి ధ్వంసం అయ్యింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్‌గాంధీకి బిహార్ ఎన్నికల ర్యాలీలో చేదు అనుభవం ఎదురైంది. బిహార్‌లోని పాలీగంజ్‌లో సోమవారం ఇండియా కూటమి ర్యాలీలో స్టేజ్‌లో కొంత భాగం కూలింది. కాగా స్టేజీపై రాహుల్‌గాంధీతో పాటు రాష్ర్టీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ ఉన్నారు.
దేశంలో సైబర్ నేరాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో అమాయకులు పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తోంది. ది ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేటర్ సెంటర్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు చూస్తే సుమారు 20,043 ట్రేడింగ్ స్కామ్‌లో జరిగాయి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని కొన్ని మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. వాటిలో పెట్ - సీటి స్కాన్ ఒకటి కాగా, తన బరువు ఏడు కిలోల వరకు తగ్గిందని, కీటోన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని వివరించారు.