Home / జాతీయం
సోహైల్ ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. మరి వారెవరో తెలుసా..
రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా సాగుతోంది. రాహుల్ వెంట పలువురు నటీనటులు వ్యాపారవేతలు ఇలా అనేక మంది నడక సాగిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో రాహుల్ వెంట ఈ యాత్రలో పాల్గొన్నందుకు ఓ స్కూల్ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు దక్షిభారతం అందులోనూ తెలంగాణ ఆంధ్రా మధ్య కూడా ఓ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ నిర్ధారించారు.
భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి అయిన పంబన్ వంతెనపై దాదాపు 84 శాతం పనులు పూర్తయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లు సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కోటా 76 శాతానికి చేరింది.
భారత నావికాదళంలో దాదాపు 3,000 మంది అగ్నివీరులు చేరుకున్నారని, వారిలో 341 మంది మహిళలు ఉన్నారని నేవీ శనివారం తెలిపింది.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే చర్య ప్రార్థనా స్థలాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడటానికి అని కోర్టు పేర్కొంది.
బొగ్గు దోపిడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛత్తీస్‌గఢ్ బ్యూరోక్రాట్ సౌమ్య చౌరాసియాను ఆమె ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్నారు.
కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది.
వచ్చే నెలలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరయ్యే ఉత్తరప్రదేశ్ బృందానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం వహిస్తారు. దీనితో ఈ ఫోరమ్‌కు హాజరవుతున్న తొలి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి రికార్డులకెక్కనున్నారు.