Home / జాతీయం
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులోని వార్డ్ నంబర్ 9లోని సీనియర్ సిటిజన్స్ సెల్లో ఉన్నారు. సిసోడియా ప్రస్తుతం తన సెల్ లో ఒక్కరే ఉన్నారు. అయితే అదే వార్డులో కొంతమంది భయంకరమైన నేరస్థులు ఉన్నారు.
ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీలో మహిళా బాడీబిల్డర్లు హనుమంతుడి చిత్రం ముందు పోజులివ్వడంపై వివాదం చెలరేగింది. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీ వేదికపై కాంగ్రెస్ కార్యకర్తలు 'గంగా జలం' చల్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు.
ఉద్యోగాల కోసం భూమి కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ మంగళవారంనాడు ప్రశ్నించనుంది.
త్రిపురలో బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మాణిక్ సాహా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే మార్గం సుగమం అయింది.ఇటీవల ముగిసిన రాష్ట్ర ఎన్నికలలో, 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపి 32 స్థానాలను గెలుచుకుంది.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్రంలోని నిరుద్యోగ విద్యావంతులైన యువతకు నెలకు రూ.2,500 భృతిని ప్రకటించింది. 2023-2024 రాష్ట్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. భృతి కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)ను ఉద్దేశించి హర్యాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పీఓకే.. భారత్‌లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్తక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
ఆమ్ఆద్మీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మరోసారి చుక్కెదురయ్యింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
భాజపా సీనియర్ నేత , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బి.ఎస్. యడియూరప్ప కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అయోమయం నెలకొంది.