Home / జాతీయం
అనామలై కలీం.. తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఏనుగు.. అడవి ఏనుగులను పట్టుకోవడం లేదా తరిమికొట్టడం కోసం 99 విజయవంతమైన ఆపరేషన్లకు నాయకత్వం వహించి 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసింది.
ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ గత నెల రోజుల నుంచి తీవ్రంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 56 ఏళ్ల సల్హౌటోనౌ క్రూసే చరిత్ర సృష్టించారు.60 ఏళ్ల రాష్ట్రావతరణలో నాగాలాండ్‌లో శాసనసభ్యురాలిగా మారిన మొదటి ఇద్దరు మహిళల్లో ఆమె ఒకరు.
బిగ్ బాస్ -16 ఫైనలిస్ట్ అర్చన గౌతమ్ తండ్రి తన కుమార్తెను చంపుతానని బెదిరించినట్లు చేసిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగత సహాయకుడిపై ఎఫ్ఐఆర్ నమోదయింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. తాజాగా ఎమ్మెల్సీ కవిత నోటీసులు ఇచ్చింది. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు, భారత వైమానిక దళం (IAF) వెస్ట్రన్ సెక్టార్లో ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించడానికి గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామిని ఎంపిక చేసింది.
Viagra: వయగ్రా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళతో సమయం గడిపేందుకు ఓ వ్యక్తి రెండు వయగ్రాలు వేసుకున్నాడు. కానీ చివరకి ఆ వ్యక్తి ప్రాణమే పోయింది. ఆల్కహాల్ తో కలిపి మాత్రలు వేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను నిరంతరం వేధిస్తున్నారని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య మంగళవారం ఆరోపించారు. లాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ను ఢిల్లీలోని ఆమె నివాసంలో సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహా మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను మంగళవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ క్యాబినెట్లో మంత్రులుగా నియమించారు.
ఓ ప్రముఖ అండర్‌గ్రౌండ్ హ్యాకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వినియోగదారుల సమాచారాన్ని డార్క్ వెబ్‌లో పోస్ట్ చేశాడు.